కర్ణాకటలో(Karnataka) రాయచూర్‌(Raichur) జిల్లాలోని ఓ గ్రామంలో కృష్ణానదిలో(Krishna river) జవ్రీ మహావిష్ణువు పురాతన విగ్రహం(Ancient Idol) దొరికింది. మహా విష్ణువు చుట్టూ దశావతారాలను కూడా చక్కగా చెక్కారు. ఈ విగ్రహంతో పాటుగా పురాతన శివలింగం(Shivlingam) కూడా బయటపడింది. విగ్రహం ఏ కాలానికి చెందిందో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ వారు పరిశోధిస్తున్నారు. అయితే నదిలో బయటపడిన మహా విష్ణువు విగ్రహాన్ని చూసిన వారు దిగ్భ్రాంతి చెందుతున్నారు.

కర్ణాకటలో(Karnataka) రాయచూర్‌(Raichur) జిల్లాలోని ఓ గ్రామంలో కృష్ణానదిలో(Krishna river) జవ్రీ మహావిష్ణువు పురాతన విగ్రహం(Ancient Idol) దొరికింది. మహా విష్ణువు చుట్టూ దశావతారాలను కూడా చక్కగా చెక్కారు. ఈ విగ్రహంతో పాటుగా పురాతన శివలింగం(Shivlingam) కూడా బయటపడింది. విగ్రహం ఏ కాలానికి చెందిందో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ వారు పరిశోధిస్తున్నారు. అయితే నదిలో బయటపడిన మహా విష్ణువు విగ్రహాన్ని చూసిన వారు దిగ్భ్రాంతి చెందుతున్నారు. అందుకు కారణం విష్ణువు విగ్రహం అయోధ్యలో(Ayodhya) ఇటీవల నిర్మించిన నూతన రామాలయంలో(Ram manir) ప్రతిష్టించిన బాలరాముడి(Ram lalla) విగ్రహంలాగే ఉండటం! కాదు కాదు, ఈ విష్ణువు రూపంలాగే బాలరాముడి విగ్రహం ఉన్నది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్. ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలను అందంగా మలిచారు. విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరత్మంతుడు లేకపోవడం విచిత్రం. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు. ఆయన మేనిపై పూలమాల ఎప్పుడూ ఉంటుంది. నవ్వు రాజిల్లుతున్న ఈ విష్ణుమూర్తి విగ్రహంపై పూల మాలలు ఉన్నాయ.

Updated On 7 Feb 2024 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story