తమిళ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్‌(Vijaykanth) అనారోగ్యంతో మరణించలేదా? ఆయనను హత్య(Murder) చేశారా? ఇలాంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు ఓ స్టార్‌ డైరెక్టర్‌. మలయాళంలో ప్రేమమ్‌(Premam), గోల్డ్‌(Gold) వంటి సినిమాలతో మంచిగుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్స్‌ పుత్రెన్‌(Alphonse Putren) తాజాగా విజయకాంత్‌ మృతిపై ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఓ షాకింగ్‌ పోస్ట్‌ పెట్టాడు.

తమిళ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్‌(Vijaykanth) అనారోగ్యంతో మరణించలేదా? ఆయనను హత్య(Murder) చేశారా? ఇలాంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు ఓ స్టార్‌ డైరెక్టర్‌. మలయాళంలో ప్రేమమ్‌(Premam), గోల్డ్‌(Gold) వంటి సినిమాలతో మంచిగుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్స్‌ పుత్రెన్‌(Alphonse Putren) తాజాగా విజయకాంత్‌ మృతిపై ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఓ షాకింగ్‌ పోస్ట్‌ పెట్టాడు. విజయకాంత్‌ను హత్య చేశారని, ఈ హత్య ఎవరు చేశారన్నది కనిపెట్టకపోతే మాత్రం తర్వాత మీ తండ్రి స్టాలిన్‌(Stalin), అలాగే మిమ్మల్ని కూడా వాళ్లు టార్గెట్ చేసే అవకాశం ఉందని రాశాడు. ఈ పోస్ట్‌ ఉదయనిధి స్టాలిన్‌కు(Udayanidhi stalin) రాసినట్టు అర్థం చేసుకోవాలి. 'కరుణానిధి, జయలలితలను హత్య చేసింది ఎవరో కనిపెట్టాలని మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్‌ విజయకాంత్‌ను ఎవరు హత్య చేశారో కూడా కనిపెట్టాలి. ఈ విషయాలను మీరు లైట్‌ తీసుకుంటారేమో! ఇప్పటికే స్టాలిన్‌ సార్‌పై, ఇండియన్‌ -2 సెట్స్‌లో కమలహాసన్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. ఒకవేళ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు' అని ఇన్‌స్టాలో అల్ఫోన్స్‌ రాశాడు. అల్ఫోన్స్ ఎందుకు ఇలా రాశారో, ఆయన చెప్పదల్చుకుంటున్నదేమిటో అర్థం కావడం లేదు.

Updated On 29 Dec 2023 3:48 AM GMT
Ehatv

Ehatv

Next Story