ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ(Technology) కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక నుంచి సెల్‌ఫోన్లకు సిమ్ కార్డు(Sim Card), నెట్(Internet) అవసరంలేకుండా వీడియోలను చూసే అవకాశం రాబోతుంది. అధునాతన సాంకేతిక డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్(Direct to Mobile Broad) కాస్టింగ్ త్వరలోనే రానున్నది.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ(Technology) కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక నుంచి సెల్‌ఫోన్లకు సిమ్ కార్డు(Sim Card), నెట్(Internet) అవసరంలేకుండా వీడియోలను చూసే అవకాశం రాబోతుంది. అధునాతన సాంకేతిక డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్(Direct to Mobile Broad) కాస్టింగ్ త్వరలోనే రానున్నది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ డీ2ఎం(D2M) సాంకేతికత ట్రయల్స్‌ను త్వరలో 19 నగరాల్లో చేపడతామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. ఇందుకోసం 470-582 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ ప్రజలు చూసే కంటెంట్‌లో 69 శాతం వీడియోలేనని పేర్కొన్నారు. 25-30 శాతం వీడియో కంటెంట్ ట్రాఫిక్‌ను డీ2ఎంకు మార్చడం ద్వారా 5జీ నెట్‌వర్క్‌లపై భారం తగ్గించే అవకాశం ఉందన్నారు. ఈ డీ2ఎం సాంకేతికతను పరీక్షించేందుకు గత ఏడాది బెంగళూరు, న్యూఢిల్లీ పరిధిలోని కర్తవ్యపథ్, నోయిడాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్ టెక్నాలజీని(Broadcasting technology) ఐఐటీ కాన్పూర్, సాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భూ సంబంధమైన టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్, స్మార్ట్ టీవీలకు స్ట్రీమ్ చేసుకోవచ్చు. బిలియన్ మొబైళ్లు, స్మార్ట్ పరికరాలకు చేరుకోగల సామర్ధ్యంతో డీ2ఎం పరిజ్ఞానాన్ని రూపొందిచారని.. డేటా ట్రాన్స్‌మిషన్, యాక్సెస్‌లో ఖర్చు తగ్గింపులు, నెట్‌వర్క్ సామర్ధ్యం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే సదుపాయాలు రానున్నాయని తెలిపారు.