అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగాయి. అ అపూర్వఘట్టాన్ని దేశ ప్రజలంతా వీక్షించారు. దేశం నలుమూలల నుంచి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం కోసం దశాబ్దాలుగా ఎదరు చూస్తున్న రామ భక్తులు..ఎప్పుడెప్పుడూ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అటు విమానయాన సంస్థలు కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యను దర్శించుకునే భక్తుల కోసం టికెట్ల ధరలలో రాయితీలు ప్రకటిస్తున్నాయి.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం (Ram temple Inauguration ), బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన (Bala Ram idol Installation) వైభవంగా జరిగాయి. అ అపూర్వఘట్టాన్ని దేశ ప్రజలంతా వీక్షించారు. దేశం నలుమూలల నుంచి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం కోసం దశాబ్దాలుగా ఎదరు చూస్తున్న రామ భక్తులు..ఎప్పుడెప్పుడూ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అటు విమానయాన సంస్థలు కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యను దర్శించుకునే భక్తుల కోసం విమానయాన సంస్థలు (Airlines) టికెట్ల ధరలలో రాయితీలు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఒక అడుగు ముందేసింది. అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకునే భక్తుల కోసం విమాన ఛార్జీలపై డిస్కౌంట్లు ఇస్తున్నట్టు (Discounts on air fares) ప్రకటించింది. దేశ, విదేశాల నుంచి రామ మందిర దర్శనం (Rama Mandir visit) కోసం వచ్చే భక్తులకు విమాన టికెట్‌ను ప్రారంభ ధర రూ.1622గా నిర్ధేశించింది. ఫిబ్రవరి 1, 2024 నుంచి దేశంలో చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్భంగా నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా దాదాపు 200 విమానాల్లో అయోధ్యకు చేరుకునే సౌకర్యం ఉంది. ఇతర దేశాల నుంచి అయోధ్యకు చేరుకునేందుకు విమానయాన సంస్థను బట్టి టికెట్ ధర ఉంటుంది. కానీ, స్పైస్‌జెట్ ప్రత్యేక ఆఫర్ (SpiceJet Special Offer) కింద రూ.1622కే అందిస్తుంది. జనవరి 22 నుంచి జనవరి 28 మధ్య బుక్ చేసుకుంటే జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30,2024లోపు.. నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు టికెట్ తేదీని మార్చుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించే అవసరం లేదని స్పైస్ జెట్ పేర్కొంది.