చత్తీస్‌గఢ్(Chhattisgarh ) రాజనందన్‌గావ్(Rajnandangaon) జిల్లా డోంగర్‌గఢ్‌లో(Dongargarh) విషాద సంఘటన చోటు చేసుకుంది. మేనకోడలి(Niece) పెళ్లి వేడుకల్లో దిలీప్ రాజ్‌కుమార్(rajkumar) పాల్గొన్నారు. స్టేజీపైన ఆనందంతో డ్యాన్సులు చేశారు. గుండె నిండుగా ఆనందపడ్డారు. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో పెళ్లి వేదికపై కాసేపు కూర్చొన్నాడు.
చత్తీస్‌గఢ్(Chhattisgarh ) రాజనందన్‌గావ్(Rajnandangaon) జిల్లా డోంగర్‌గఢ్‌లో(Dongargarh) విషాద సంఘటన చోటు చేసుకుంది. మేనకోడలి(Niece) పెళ్లి వేడుకల్లో దిలీప్ రాజ్‌కుమార్(Dilip rajkumar) పాల్గొన్నారు. స్టేజీపైన ఆనందంతో డ్యాన్సులు చేశారు. గుండె నిండుగా ఆనందపడ్డారు. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో పెళ్లి వేదికపై కాసేపు కూర్చొన్నాడు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయింది. క్షణాల్లో కుప్పకూలిపోయారు. నిమిషం ఆలస్యం చేయకుండా కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పెళ్లి ఇంట్లో విషాధఛాయలు అలుముకున్నాయి. బాలోద్ జిల్లాలో నివసిస్తున్నారు దిలీప్ రాజ్‌కుమార్ భిలాయ్ స్టిల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
పెళ్లివేదికపై దిలీప్ రాజ్‌కుమార్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు, ఆయన గుండుపోటుతో కుప్పకూలిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో గుండెపోటు సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. స్కూల్ విద్యార్థులకు కూడా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. క్రికెట్ ఆడుతూ, జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ, డాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలుతున్నారు.