హడావుడిలోనో, మతిపరుపులోనో మనం అప్పుడప్పుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను(Driving license) ఇంట్లోనే పెట్టి బండేసుకుని తిరుగుతుంటాం! అలాంటి టైమ్‌లో పోలీసులకు చిక్కితే? జేబులో పాన్‌కార్డు పెట్టుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌కు వెళితే? ఆధార్‌కార్డు(Aadhaar Card) వెంట తెచ్చుకోకుండా ట్రైన్‌ రిజర్వేషన్‌ చేయించుకుందామని వెళితే..? ఇబ్బందే కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలి? దీనికో సొల్యూషన్‌ ఉంది. మనకు తరచూ ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌ కార్డు అవసరమవుతుంటాయి.

హడావుడిలోనో, మతిపరుపులోనో మనం అప్పుడప్పుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను(Driving license) ఇంట్లోనే పెట్టి బండేసుకుని తిరుగుతుంటాం! అలాంటి టైమ్‌లో పోలీసులకు చిక్కితే? జేబులో పాన్‌కార్డు పెట్టుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌కు వెళితే? ఆధార్‌కార్డు(Aadhaar Card) వెంట తెచ్చుకోకుండా ట్రైన్‌ రిజర్వేషన్‌ చేయించుకుందామని వెళితే..? ఇబ్బందే కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలి? దీనికో సొల్యూషన్‌ ఉంది. మనకు తరచూ ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌ కార్డు అవసరమవుతుంటాయి. వాటిని ఫిజికల్‌గా వెంటపట్టుకుని వెళ్లడం కుదరకపోవచ్చు. మర్చిపోనూ వచ్చు. ఏది మర్చిపోయినా మొబైల్‌ఫోన్‌ను మర్చిపోము కదా! ఆ స్మార్ట్‌ఫోన్‌లోనే(Smart phone) గుర్తింపు కార్డులను డిజిటల్‌(digital Card) రూపంలో స్టోర్‌ చేసుకుంటే సరి! ఇందుకోసం మనకు డీజీ లాకర్‌(Digi Locker) అనే యాప్‌ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను భద్రపరచుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు ఈజీగా యూజ్‌ చేసుకోవచ్చు. టెంత్‌ క్లాస్‌ సర్టిఫికెట్‌ దగ్గర్నుంచి మొదలుపెడితే ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు కార్డు ఇలా ప్రభుత్వం ఇచ్చిన అన్ని డాక్యుమెంట్లను డిజిటల్‌ రూపంలో ఈ లాకర్‌లో స్టోర్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం ఏం చేయాలంటే ముందు ప్లే స్టోర్‌ నుంచి డీజీలాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. మన పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేస్తే సిక్స్‌ డిజిట్‌ సెక్యూరిటీ పిన్‌ వస్తుంది. ఆ నంబర్‌ను సంబంధిత బ్లాక్‌లో ఎంటర్‌ చేయాలి. మన ఆధార్‌కార్డు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేస్తే అకౌంట్‌ క్రియేట్‌ అవుతుంది. తర్వాత ఆధార్‌ నంబర్‌ లేదా ఆరు అంకెల సెక్యూరిటీ పిన్‌ సాయంతో లాగిన్‌ అవ్వగానే మన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్‌లో సెర్చ్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి మన రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్‌ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మన ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్‌ నంబర్‌, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్‌ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్‌కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు. కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాదు. ఇతర విలువైన పత్రాలను కూడా డిజిటల్‌ రూపంలో ఈ లాకర్‌లో స్టోర్‌ చేసుకోవచ్చు. డిజీలాకర్‌ యాప్‌లో సైన్‌ఇన్‌ కాగానే కిందకు స్క్రోల్‌ చేస్తే డిజీలాకర్‌ డ్రైవ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి ‘+’ సింబల్‌పై ప్రెస్‌ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్‌గా అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్‌ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్‌లో ప్రతీ యూజర్‌కు 1 జీబీ క్లౌడ్‌ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్‌ ఉన్న ఒక్కో ఫైల్‌ను స్టోర్‌ చేసుకోవచ్చు.

Updated On 11 Jun 2024 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story