✕
వాడవాడ, వీధి వీధి వినాయకమండపాలతో కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆ గణపతే(Ganapathi) కనిపిస్తున్నాడు.

x
Ganesh Idols
-
- చవితి నవరాత్రుల వేళ అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. వినాయకుడి మంటపాలలో ఆ ఆదిదేవుడు తీరున్నొక్క విధంగా దర్శనమిస్తున్నాడు.
-
- రాయీ రప్పా, ఆకూ కాయ ఇలా ఎక్కడ వెతికితే అక్కడ గజానన రూపం సాక్షాత్కరిస్తుంది. ఆయన ఒక ప్రాంతానికి పరిమితమైన దైవం కాదు. ప్రపంచమంతటా కొలవబడిన దేవదేవుడు.
-
- వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు
-
- నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదం.
-
- హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.వారు ఎలిఫెంట్ ఫేస్ గాడ్(Elephant Fest God) అంటూ తమకు తోచిన పదజాలంతో ఆ విఘ్నేశ్వరుడిని పిలుచుకుంటారు.
-
- మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే. వినాయకుడు ఎవరూ తయారు చేయకుండానే ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా కనిపిస్తూనే వుంటాడనడానికి అనేక ఆధారాలున్నాయి.
-
- రాళ్ళు ఆకులు చెట్లు కూరగాయలు వంటి అనేక వస్తువుల్లో వినాయక ఆకృతి దర్శనిమివ్వడాన్ని మనం చూశాం విన్నాం.

Ehatv
Next Story