Evil Eye Remedies : చిన్నారులకు దిష్టి తీసే మార్గాలు..!
దిష్టి(Disti) తగిలిందని మన పెద్దవాళ్ల నోటి వెంటా తరుచుగా ఉంటాం. దిష్టి తీయాలని తెలిసినవారి దగ్గరికి వెళ్తుంటాం. కొందరు విదేశాల్లో ఉన్నా కానీ తమ చిన్నారులకు, లేదా తమవారికి దిష్టి తగిలిందని చెప్పి తెలిసినవారితో దిష్టి తీయించుకుంటారు. ముఖ్యంగా చిన్నారులకు ఈ దిష్టి ఎక్కువగా తగులుతుందని కొందరు చెప్తున్నారు. చిన్న పిల్లలు క్యూట్‌గా(Cute Children) ఉండడంతో సహజంగానే చూడగానే ఆకర్షిస్తారు.
దిష్టి(Disti) తగిలిందని మన పెద్దవాళ్ల నోటి వెంటా తరుచుగా ఉంటాం. దిష్టి తీయాలని తెలిసినవారి దగ్గరికి వెళ్తుంటాం. కొందరు విదేశాల్లో ఉన్నా కానీ తమ చిన్నారులకు, లేదా తమవారికి దిష్టి తగిలిందని చెప్పి తెలిసినవారితో దిష్టి తీయించుకుంటారు. ముఖ్యంగా చిన్నారులకు ఈ దిష్టి ఎక్కువగా తగులుతుందని కొందరు చెప్తున్నారు. చిన్న పిల్లలు క్యూట్‌గా(Cute Children) ఉండడంతో సహజంగానే చూడగానే ఆకర్షిస్తారు. తమ హావభావాలతో ఇతరుల కళ్లలో పడుతుంటారు. అయితే అందరి కళ్లు మంచివికావని మనం వింటుంటాం. వారి కళ్లు పడితే అంతే అంటారు. కొందరు చిన్నారులు చికాకు పడుతుంటారు, పదే పదే ఏడుస్తుంటారు. ఆహారం కూడా సరిగా తీసుకోరు. దీంతో పాప లేదా బాబుకు దిష్టి తగిలిందని దిష్టి మంత్రం వేయించుకుంటారు. చిన్నారులకు దిష్టి తీసే మార్గాలను కొందరు వ్యక్తులు సూచిస్తున్నారు
చిన్న పిల్లలను నల్ల దారం(Black Thread) ఉపయోగించాలి. నలుపు దారం రాహు-కేతులను సూచిస్తుంది. పిల్లల కాళ్లకు, చేతులకు, నడుముకు నల్ల దారాలు కట్టడం ద్వారా దిష్టి తగలదని చెప్తున్నారు.
చిన్నారులకు దిష్టి తగిలిందనిపిస్తే.. ఓ రాగి పాత్రలో(Copper Bowl) నీరు, తాజా పువ్వులను తీసుకోని.. ఆ చిన్నారి తలపై 11 సార్లు పిల్లల తలపై తిప్పాలి. ఆ తర్వాత మొక్క ఉన్న కుండలో పోయాలి.
శనివారం అయితే హనుమంతుని ఆలయానికి వెళ్లి, హనుమంతుని భుజం నుంచి కొంత సింధూరాన్ని తీసుకొని, పిల్లల తలపై పూస్తే దిష్టిని పారదోసే అవకాశం ఉందంటున్నారు.
ఇక మరోక రెమెడీ ఏంటంటే.. ఎర్ర మిరపకాయలు(Red chillie), పసుపు(Turmeric) ఆవాలు మట్టి కుండలో తీసుకుని వేడి చేసి దాని పొగను పిల్లలు పీల్చేలా చేయాలంటున్నారు. ఎర్ర మిరపకాయలను తీసుకొని పిల్లల తలపై 7 సార్లు ఊపి.. ఈ మిరపకాయను మంటలో వేస్తే దిష్టి తగ్గుతుందని చెప్తున్నారు.