ఓవరాక్షన్‌ కారణంగా ఐఏఎస్‌ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌(Pooja Kedekar) అడ్డంగా దొరికిపోయిన వైనం మనకు తెలిసిందే.

ఓవరాక్షన్‌ కారణంగా ఐఏఎస్‌ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌(Pooja Kedekar) అడ్డంగా దొరికిపోయిన వైనం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆమె లొసుగులన్నీ బయపడ్డాయి. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల(physical disable) కోటా విషయంలో ఆమె మోసానికి పాల్పడ్డారు. ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ(UPSC) ఆమెను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేసింది. తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్‌ తప్పదని పూజా ఖేద్కర్‌ అనుకున్నారు. వెంటనే ముందస్తు బెయిల్‌(Interim bail) కోసం ఢిల్లీ కోర్టును(Delhi Court) ఆశ్రయించారు. తన న్యాయవాది ద్వారా ఢిల్లీ పాటియల హౌజ్‌ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. పూజను కస్టోడియల్‌ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్‌ను తిరస్కరించింది కోర్టు. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుట హాజరుకావల్సి ఉండింది. దానికి కూడా హాజరుకాలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఈ నెల 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30వ తేదీ వరకే అవకాశం ఇచ్చింది. ఆమె మాత్రం రాలేదు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. .. పుణే పోలీసులు స్పందిస్తే తప్ప ఆమె పరారైన విషయంపై క్లారిటీ రాదు.

Eha Tv

Eha Tv

Next Story