భారతీయ జనతా పార్టీ ఉత్తినే ఏదీ చేయదు. బీజేపీ(BJP) వేసే ప్రతి అడుగులో ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. బీజేపీ అంటే బీజేపీ కాదు కానీ నరేంద్రమోదీ(Narendra Modi), అమిత్‌ షా(Amit Shah)లన్న మాట! ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి(Mega Star Chiranjeevi)కి పద్మవిభూషణ్‌(Padma Vibhushan) బిరుదునిచ్చింది కదా!

భారతీయ జనతా పార్టీ ఉత్తినే ఏదీ చేయదు. బీజేపీ(BJP) వేసే ప్రతి అడుగులో ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. బీజేపీ అంటే బీజేపీ కాదు కానీ నరేంద్రమోదీ(Narendra Modi), అమిత్‌ షా(Amit Shah)లన్న మాట! ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి(Mega Star Chiranjeevi)కి పద్మవిభూషణ్‌(Padma Vibhushan) బిరుదునిచ్చింది కదా! ఈ పురస్కారానికి చిరంజీవి అర్హుడా కాదా అన్నది కాదు, ప్రత్యేకించి చిరంజీవికే ఎందుకిచ్చిందన్నదానిపైనే చాలా మంది సవాలక్ష అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఏదో ఆశించే దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని చిరంజీవికి కట్టబెట్టిందని అనుకుంటున్నారు. ఆ అనుకోవడం చిరంజీవి రాజకీయ పున:ప్రవేశం వరకు వెళ్లింది. మళ్లీ రాజకీయాల జోలికి రానేరానంటూ చిరంజీవి చాలాసార్లు చెప్పారు. కాకపోతే కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం ఇప్పటి వరకు రాజీనామా చేయలేదాయన! ఈ విషయం పక్కన పెడితే త్వరలోనే రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. 15 రాష్ట్రాలలో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి చెరో మూడేసి స్థానాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కాదు కానీ ఏ ఉత్తరప్రదేశ్‌ నుంచో, బీహార్‌ నుంచో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ భావిస్తున్నదట! తద్వారా మరోసారి చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నదట! దీనివల్ల చిరంజీవికి ఒనగూరే ప్రయోజనం ఏముంటుందో తెలియదు కానీ బీజేపీ మాత్రం మస్తు ప్రయోజనాలుంటాయి. మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరగాలంటే చిరంజీవిలాంటి వాళ్ల అవసరం ఎంతో ఉంది. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో చిరంజీవి సేవల్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ ఆలోచన! కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే చిరంజీవికి మంత్రి పదవిని కూడా ఇవ్వనుందట! ఇదేమో సోషల్‌ మీడియాలో వస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. నేషనల్‌ మీడియాలో చిరు పొలిటికల్‌ రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. చిరంజీవి మాత్రం ఎప్పటిలాగే ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫోకసంతా సినిమాలపైనే ఉంది. ఏమో.. బీజేపీ పెద్దలు చెప్పిన తర్వాత కాదనగలరా?

Updated On 31 Jan 2024 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story