ఎనిమిది రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రారంభమయ్యింది. ప్రాణ ప్రతిష్ట వేడుక అంత్యంత వైభవంగా జరిగింది. బాలరాముడు మందిరంలో కొలువుతీరాడు. ప్రధాని మోదీ(PM Modi) చేతుల మీదగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది హిందువులు ఈ ఉత్సవాన్ని చూశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భక్తులు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు.
ఎనిమిది రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రారంభమయ్యింది. ప్రాణ ప్రతిష్ట వేడుక అంత్యంత వైభవంగా జరిగింది. బాలరాముడు మందిరంలో కొలువుతీరాడు. ప్రధాని మోదీ(PM Modi) చేతుల మీదగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది హిందువులు ఈ ఉత్సవాన్ని చూశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భక్తులు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. కేవలం 45 రోజుల్లోనే పది కోట్ల మందికిపైగా భక్తులు మందిరం కోసం 2, 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్(Dilip kumar) లఖీ భారీ విరాళం ఇచ్చారు. 68 కోట్ల రూపాయలు విలువచేసే 101 కిలోల(Gold) బంగారాన్ని రామమందిరం కోసం ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, బాలరాముడి ఆయలంలోని డ్రమ్, త్రిశూలం వంటి నిర్మాణాలకు ఉపయోగించారు. దిలీప్ కుమార్ లఖి తండ్రి కూడా వజ్రాల వ్యాపారే! దేశ విభజనకు రెండేళ్ల ముందు జైపూర్ వచ్చారు. చిన్ననాటి నుంచే దిలీప్‌కుమార్ వ్యాపారంలోని మెలకువలను నేర్చుకున్నారు. కుటుంబ వ్యాపారంలో సాయం చేస్తూనే వజ్రాల వ్యాపారంలో రాణించారు. ప్రస్తుతం సూరత్‌లో ప్రపంచంలోని అతి పెద్ద డైమండ్ పాలిషింట్ ఫ్యాక్టరీకి ఆయన యజమాని. ఆరు వేల మందికి పైగా ఉద్యోగులు ఆయన సంస్థలలో పని చేస్తున్నారు. థాయిలాండ్, అమెరికా, దుబాయ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కూడా 33 కిలోల బంగారాన్ని, దాంతో పాటే 2.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.