Ranthambore Vinayaka Temple : త్రినేత్ర విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసా?
త్రినేత్రుడంటే శివుడనే(Lord Shiva) అనుకుంటాం! కానీ త్రినేత్ర విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు.. రాజస్థాన్‌లోని(Rajasthan) రణథంబోర్‌లో(Ranthambore) వెలిసిన వినాయకుడికి మూడు కళ్లుంటాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో హమీర్(Hamir) అనే రాజు నిర్మించాడు. ఖిల్జీతో జరిగిన సంగ్రామంలో హమీర్ పూర్తిగా నష్టపోయాడట! ఏడేళ్లపాటు సాగిన ఆ యుద్ధంలో ఓటమి అంచుల వరకూ వెళ్లాడట హమీర్!
త్రినేత్రుడంటే శివుడనే(Lord Shiva) అనుకుంటాం! కానీ త్రినేత్ర విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు.. రాజస్థాన్‌లోని(Rajasthan) రణథంబోర్‌లో(Ranthambore) వెలిసిన వినాయకుడికి మూడు కళ్లుంటాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో హమీర్(Hamir) అనే రాజు నిర్మించాడు. ఖిల్జీతో జరిగిన సంగ్రామంలో హమీర్ పూర్తిగా నష్టపోయాడట! ఏడేళ్లపాటు సాగిన ఆ యుద్ధంలో ఓటమి అంచుల వరకూ వెళ్లాడట హమీర్! ఓ రోజు రాత్రి వినాయకుడు కలలో కనిపించి తెల్లారితే యుద్ధం ఆగిపోతుందనీ, విజేతగా నిలుస్తావనీ, సమస్యలన్నీ తొలగిపోతాయనీ చెప్పాడట! మరుసటి రోజున వినాయకుడు చెప్పినట్టే జరిగిందట! దాంతో పాటు హమీర్ కోటగోడపై విఘ్నేశ్వరుడి ప్రతిమ ఒకటి స్వయంగా వెలిసిందట! ఆ మూర్తికి మూడు కళ్లు ఉన్నాయట! ఆ విగ్రహాన్ని చూసిన హమీర్ వెంటనే అక్కడో ఆలయాన్ని నిర్మించాడట! అదే రణథంబోర్ వినాయక ఆలయం(Ranthambore Vinayaka Temple)! రణథంబోర్ వినాయకుడికి మూడుకళ్లు ఉండటంతో త్రినేత్ర విఘ్నేశ్వరుడయ్యారు.. ఇలా మూడు కళ్లు కలిగిన వినాయకుడి ఆలయాల్లో రణథంబోర్ ఆలయమే ఫస్ట్. బెస్ట్ కూడా! వినాయకుడి భార్యలు సిద్ధి, బుద్ధి, కుమారుల విగ్రహాలతో పాటు ఎలుక విగ్రహం కూడా ఇక్కడ ఉంది. సకుటుంబ సపరివారంగా వినాయకుడు కొలువై ఉన్న ఏకైక ఆలయం ఇదే! ఈ ఆలయపు మరో విశిష్టత ఏమిటంటే, తమ కోరికలు తీర్చమని వినాయకుడికి భక్తులు ఉత్తరాల(Letter) ద్వారా విన్నవించుకుంటారు. అంతేనా శుభకార్యాలకు కూడా వినాయకుడికి ఆహ్వానం పంపుతుంటారు. కోరికలు నెరవేరిన వారు తమ కృతజ్ఞతలను కూడా ఉత్తరాల ద్వారానే తెలుపుకుంటారు. ఆ విధంగా ఆలయానికి రోజూ పాతిక కిలోల ఉత్తరాలు వస్తుంటాయి..