ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) మరోసారి అవినీతే(corruption) గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లో మరుగుదొడ్ల(Toilets) నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఒక సామాజిక కార్యకర్త పోరాటం చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) మరోసారి అవినీతే(corruption) గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లో మరుగుదొడ్ల(Toilets) నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఒక సామాజిక కార్యకర్త పోరాటం చేశాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆ వృద్ధుడు చివరకు తుదిశ్వాస విడిచాడు. బీజేపీ(BJP) పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మధుర జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందంటూ సామాజిక కార్యకర్త అయిన 66 ఏళ్ల దేవకీనంద్ శర్మ పెద్ద ఉద్యమమే చేశాడు. గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు కోసం నియమించిన కమిటీలో సభ్యుడిగాను ఆయన ఉన్నాడు. అయితే ఈ అవినీతిపై కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను దేవకీనంద్ శర్మ వ్యతిరేకించాడు. కమిటీ విచారణ పారదర్శకంగా జరగలేందని.. మరోసారి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు. ఫిబ్రవరి 12 నుంచి ఇంటికి దగ్గరలోని ఆలయం బయట నిరాహార దీక్ష చేపట్టాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న దేవకీనంద్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాది అధికారులకు సమాచారం ఇచ్చారు.
దేవకీనంద్(Devakinand) ఆరోగ్యం క్షీణించడంతో తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దేవకీనంద్ దీక్ష విరమింపజేసేందుకు డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశ్ కుమార్ ఆస్పత్రిలో అతనిని కలిశారు. అతని డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, దీక్ష విరమించాలని విజ్ఞప్తిచేశాడు. అయినా దేవకీనంద్ శర్మ వినలేదు. ఈ అవినీతిపై తాజా దర్యాప్తు కోసం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ అధికారం తనకు లేదంటూ డివిజనల్ మేజిస్ట్రేట్ వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే దేవకీనంద్ ఆరోగ్యం మరింత వికటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సామాజిక కార్యకర్త దేవకీనంద్ మృతితో ఆయన అభిమానులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా వేలాది మంది స్పందిస్తున్నారు.