కర్ణాటకలోని(Karnataka) బళ్లారి(Ballari) లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప(Devendrappa) కొడుకు రంగనాథ్‌పై(Ranganath) చీటింగ్ కేసు(Cheating case) నమోదయ్యింది. బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 420, 417, 506 సెక్షన్ల కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. డిటైల్స్‌లోకి వెళితే మైసూరు మహారాజా కాలేజీలో(Mysore Maharaj college) ఎంపీ దేవేంద్రప్ప కొడుకు రంగనాథ్ లెక్చరర్‌గా(Lecturer) పని చేస్తున్నాడు. ఇతడిపై 24 ఏళ్ల దేవిక అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది.
కర్ణాటకలోని(Karnataka) బళ్లారి(Ballari) లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప(Devendrappa) కొడుకు రంగనాథ్‌పై(Ranganath) చీటింగ్ కేసు(Cheating case) నమోదయ్యింది. బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 420, 417, 506 సెక్షన్ల కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. డిటైల్స్‌లోకి వెళితే మైసూరు మహారాజా కాలేజీలో(Mysore Maharaj college) ఎంపీ దేవేంద్రప్ప కొడుకు రంగనాథ్ లెక్చరర్‌గా(Lecturer) పని చేస్తున్నాడు. ఇతడిపై 24 ఏళ్ల దేవిక అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. 18 నెలల నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ శారీరకవాంఛలు తీర్చుకుని తనను వదిలేశాడని ఆమె చెబుతోంది. పెళ్లి చేసుకోమంటుంటే ముఖం చాటేస్తున్నాడని తెలిపింది. అమ్మనాన్నకు పరిచయం చేస్తానని చెప్పి ప్రైవేటు హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడని దేవిక(Devika) చెబుతోంది. పోలీసులకు కప్లంయిట్ ఇచ్చిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడింది. అతడికి అంతకు ముందే పెళ్లయినట్టు తనకు తెలియదన్నారు. పెళ్లి చేసుకోవాలని నేను ఎంత బ్రతిమాలినప్పటికీ ఒప్పుకోలేదు, డబ్బు ఇస్తాను, నన్ను వదిలి వెళ్లిపో అని ఒత్తిడి చేశాడని ఆమె పేర్కొంది. ఇదిలా ఉంటే, తన కుమారుడు సుద్దిపూస అని, అతడిపై కుట్రతో కేసు నమోదు చేశారని దేవేంద్రప్ప అంటున్నారు. ఆరు నెలల కిందట ఓ యువతి తనకు కూడా ఫోన్ చేసి తన కొడుకు గురించి చెప్పిందన్నారు ఎంపీ. అయితే మా వాడు తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టులు ఉన్నాయని సూచించానని అన్నారు. మరోవైపు 42 ఏళ్ల రంగనాథ్ కూడా ఆమెపై పోలీసులకు కంప్లయింట్ చేశాడు. డబ్బు కోసం ఓ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఫిర్యాదు చేశాడు. 'నా ఫ్రెండ్ కల్లేష్ నుంచి దేవిక పరిచయమయ్యింది. రెండు మూడు సార్లు కలిసిన తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ నేను ప్రేమించడం లేదని నేరుగా ఆమెతో చెప్పాను' అని రంగనాథ్ తెలిపాడు.