అత్యాచారం, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు ఆగస్టు 13న ఏడోసారి 21 రోజుల ఫర్‌లాఫ్ మంజూరైంది.
గుర్మిత్ రామ్‌రహీం సింగ్(Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరాబాబ(Dera baba) హర్యానా(Haryana) అసెంబ్లీ ఎన్నికల(ELections) సందర్భంగా ఓటు వేయడానికి వారం ముందు జైలు నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు. ఇందుకోసం 20 రోజుల ఎమర్జెన్సీ పెరోల్(Emergency perol) కోసం జైళ్ల శాఖను కోరాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా జైళ్లశాఖ ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరింది. ఎన్నికల వేళ పెరోల్ ఎంతవరకు సముచితమని ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. రామ్ రహీమ్ పెరోల్ పై సోమవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా జైలు అధికారులు ఈ విషయంలో మౌనం పాటించారు. అధికారికంగా ధృవీకరించడానికి వారు సిద్ధంగా లేరు.
అత్యాచారం, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు ఆగస్టు 13న ఏడోసారి 21 రోజుల ఫర్‌లాఫ్ మంజూరైంది. సెప్టెంబర్ 5న పెరోల్ తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు. రామ్ రహీమ్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే బయటకు రావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం జైళ్ల శాఖ ద్వారా 20 రోజుల ఎమర్జెన్సీ పెరోల్ కోరాడు. డేరాబాబ రాక రాజకీయాలతో ముడిపడి ఉంది. ప్రతి ఎన్నికల సమయంలో ఆయన తన అనుచరులైన రాజకీయ నాయకులకు సందేశాలు ఇస్తాడు. పంజాబ్‌కు ఆనుకుని ఉన్న అసెంబ్లీ స్థానాలపై ఆయన ప్రభావం ఉంటుంది. దీంతో రామ్ రహీమ్ పెరోల్ సర్వత్రా చర్చ నడుస్తోంది.