బీహార్ లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని సోమవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్ అన్నారు.
బీహార్(Bihar)లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని సోమవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) అన్నారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్ అన్నారు. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. మేము పెన్నులు(Pens) పంపిణీ చేస్తున్నాము, కానీ కొంతమంది కత్తులు(kinfes) పంచడంలో బిజీగా ఉన్నారని బీజేపీపై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీహార్ అభివృద్ధి చెందకుండా దేశం ముందుకు సాగదన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ.. బీహార్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేక హోదా వస్తేనే అగ్ర రాష్ట్రంగా ఎదుగుతాం. అయినప్పటికీ.. మేము స్వంతంగా పని చేస్తున్నాము. వేగంగా ముందుకు సాగుతున్నామన్నారు.
బీహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌ల వంటి విద్యాపరమైన మౌలిక సదుపాయాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని ఆయన అన్నారు. బీహార్‌లో మంచి విద్యాసంస్థల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఈ విషయంలో రాజకీయం కూడా ఉందన్నారు. రాష్ట్రీయ జనతాదళ్(RJD)కు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్రంలో 1.70 లక్షలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది.