రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను

కర్ణాటక బడ్జెట్‌కు ముందు సంప్రదింపుల కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సభకు హాజరైన నేతలు హర్షం వ్యక్తం చేశారు. రైతు సంఘంలో పౌష్టికాహారం పెంపుదల, సరస్సుల అభివృద్ధి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల నైపుణ్యాలను పెంపొందించడం, రైతు వర్గాల యువతలో ఆశలు రేకెత్తించేలా బడ్జెట్‌లో కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో రైతుల నుంచి చాలా డిమాండ్లు వచ్చాయి.

ముఖ్యంగా రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రైతులు కోరారు. సేద్యాన్ని నమ్ముకుని, ఏటా రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నా, 45 ఏళ్లు వస్తున్నప్పటికీ రైతులకు వివాహం కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు వాపోయారు. రైతుల రుణమాఫీతో పాటు రైతును వివాహం చేసుకునే యవతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రికి రైతు సంఘాల నాయకుడు బడగలపుర నాగేంద్ర వినతి పత్రాన్ని అందించారు. బడ్జెట్లో సేద్యానికి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు నిధుల కేటాయింపునకు సంబంధించి రైతు సంఘాలకు చెందిన 218 మంది రైతులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భేటీ అయ్యారు.

Updated On 11 Feb 2024 10:30 PM GMT
Yagnik

Yagnik

Next Story