దేశ వ్యాప్తంగా దీపావళి పండగ ఘనంగా జరుపుకున్నారు. దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న హిందువులు సైతం దీపావళిని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇళ్లకు, కార్యాలయాలకు దీపాలంకరణ చేసి అందంగా ముస్తాబు చేస్తారు. దీపావళి పండగనాడు కొత్త దుస్తులు ధరించి, ఇంట్లో పలు రకాల స్వీట్లు తయారు చేసుకుంటారు.

దేశ వ్యాప్తంగా దీపావళి పండగ ఘనంగా జరుపుకున్నారు. దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న హిందువులు సైతం దీపావళిని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇళ్లకు, కార్యాలయాలకు దీపాలంకరణ చేసి అందంగా ముస్తాబు చేస్తారు. దీపావళి పండగనాడు కొత్త దుస్తులు ధరించి, ఇంట్లో పలు రకాల స్వీట్లు తయారు చేసుకుంటారు. ఈ సందర్భంగా చాలా మంది తమ ఫ్యాషన్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. సాధారణంగా మహిళలు పండగలు, పెళ్లిళ్లకు పూల జడ అల్లుకోవడం సహజం. కానీ ఓ మహిళ విభిన్నంగా ఆలోచించింది. దీపావళికి సాంప్రదాయబద్ధంగా తయారైనప్పటికీ, బాణాసంచాతో కేశాలంకరణ చేసుకుంది. వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఢిల్లీ(Delhi)లో ఓ మహిళ తన జడకు బాణాసంచాను అమర్చి ముస్తాబైంది. బనారసీ చీరను ధరించిన మహిళ జడకు తన హెయిర్‌ స్టైలిస్ట్‌ క్రాకర్స్‌ అమర్చడం వీడియోలో కనిపిస్తోంది. ఆ మహిళ రకరకాల బాణాసంచాలో అలంకరించుకుంది. తన జుట్టుకు రాకెట్లు, సుతిలీ బాంబులు, భూచక్రాలు సహా పలు రకాల బాణాసంచాను అమర్చుకుంది. దీపావళినాడు ప్రత్యేకమైన లుక్ కోసం జుట్టు అంతా క్రాకర్స్‌తో అలంకరించుకుంది. ఇది చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఆ బాణాసంచాకు మంటలు అంటుకుంటే ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేయొద్దని ఆ మహిళకు సూచిస్తున్నారు. ప్రమాదకరమైన కార్యకలాపాలను ప్రోత్సహించొద్దని హితవు పలుకుతున్నారు. ఈ రోజుల్లో మొబైల్‌ను పిల్లలు ఎక్కువగా వాడుతున్నారని, సోషల్‌ మీడియాలో చాలా పిల్లలు చురుకుగా ఉంటున్నారని, వారు దీనిని అనుకరించి ఏదైనా ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యులను ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బాణాసంచాతో కేశాలంకరణ చేసుకున్న మహిల వీడియో వైరల్‌గా మారింది.

Updated On 15 Nov 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story