దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత తీవ్రమైన స్వైన్ ఫ్లూ (H1N1) వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత తీవ్రమైన స్వైన్ ఫ్లూ (H1N1) వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజా డేటా ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని 54% కంటే ఎక్కువ కుటుంబాలు కనీసం ఒక సభ్యుడిని స్వైన్ ఫ్లూ లేదా ఇన్‌ఫ్లుఎంజా A లక్షణాలతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయి. "ఢిల్లీ-ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లోని 54 శాతం ఇళ్లలో తలనొప్పి, నిరంతర దగ్గు, అలసట, తేలికపాటి జ్వరాలు, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి."కేసులు ఈ ఆకస్మిక పెరుగుదల వివిధ వయసుల వ్యక్తులను ప్రభావితం చేసింది, జ్వరం మరియు దగ్గు వంటి లక్షణాలను తోసిపుచ్చవద్దని ఆరోగ్య నిపుణులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. గత నెలలో ఇన్‌ఫ్లుఎంజా లాంటి అనారోగ్య కేసుల పెరుగుదల నమోదైందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంక్రమణకు కారణమయ్యే ఇన్ఫ్లుఎంజా A, B, H1N1, H3N2, శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV)లను రోగుల్లో గుర్తించినట్లు తెలిపారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధుల నుండి కోలుకునే కాలం సాధారణంగా 5-7 రోజులకు మించి ఉంటుందని, చాలా మంది వ్యక్తులు 10 రోజుల వరకు లక్షణాలను అనుభవిస్తున్నారని నిపుణులు తెలిపారు.

ehatv

ehatv

Next Story