ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 80కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 80కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ముందుజాగ్రత్తగా పాఠశాల ఆవరణలన్నీ ఖాళీ చేయించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు పాఠశాలల్లో బాంబు బెదిరింపుపై ఢిల్లీ పోలీస్ పీఆర్‌వో సుమన్ నల్వా మాట్లాడుతూ.. “చాలా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని మమ్మల్ని సంప్రదించారు. ఢిల్లీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కానీ ఎటువంటి అవాంఛనీయమైన ఘటన జరగలేదు. ఈ విషయంలో భయాందోళనలకు గురికావద్దని.. ఈ మెయిల్స్ ఎవరో పంపారో గుర్ఇంచే పనిలో ఉన్నామని చెప్పారు.
ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. “ఈ రోజు ఉదయం కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విద్యార్థులను ఇంటికి పంపించి పాఠశాల ఆవరణను ఖాళీ చేయించాం. ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పాఠశాలలో ఎటువంటి బాంబు కనుగొనబడలేదు. పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.