భారతదేశం(India) మండిపోతున్నది. అధిక ఉష్ణోగ్రతలతో(Temperature) అల్లాడిపోతున్నది. ఉత్తరాదిలో అయితే మరీ భయంకరం. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండటంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాజస్తాన్‌లో(Rajasthan) అయితే చాలా చోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. పాకిస్తాన్‌(Pakisthan) మీదుగా అక్కడి నుంచి వీస్తున్న తీవ్రమైన వేడిగాలులతో(Heatwaves) దేశ రాజధాని ఢిల్లీ కూడా సతమతమవుతోంది. మునుపెన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ(Delhi) దగ్గర ఉన్న మంగేశ్‌పూర్‌లో(Mangeshpur) దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యిందంటూ వచ్చిన వార్తలు ఉలిక్కిపడేలా చేశాయి.

బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.14 గంటల మధ్యలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ కుల్‌దీప్‌ శ్రీవాస్తవనే చెప్పారు. అయితే మన దేశంలో రాజస్తాన్‌ పాటు ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే 52.9 డిగ్రీలన్నది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదంటున్నారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజజు. అంత ఉష్ణోగ్రత నమోదయ్యిందంటే నమ్మడం కష్టంగా ఉందని, వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించామని చెప్పారు. డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు.

అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు అని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్ర అంటున్నారు. ముంగేశ్‌పూర్‌ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోందని చెప్పారు. అయితే ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, అక్కడ గత 79 ఏళ్లలో ఇదే అత్యధికమని చెప్పారు. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలైతే భగభగమని మండిపోతున్నాయి. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి.

దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. చిత్రంగా ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రెండు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.

Updated On 30 May 2024 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story