దేశ రాజధానిలోని ఓ స్కూల్‌కు బాంబ్ బెదిరింపు రావడం కలకలం రేపింది. ఢిల్లీలోని పుష్ప విహార్‌లోని అమృత స్కూల్‌కు మంగళవారం ఉదయం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
దేశ రాజధానిలోని ఓ స్కూల్‌కు బాంబ్ బెదిరింపు రావడం కలకలం రేపింది. ఢిల్లీ(Delhi)లోని పుష్ప విహార్(Pushp Vihar)లోని అమృత స్కూల్(Amrita School)కు మంగళవారం ఉదయం మెయిల్(Mail) ద్వారా బాంబు బెదిరింపు(Bomb Threat)వచ్చింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ పాఠశాలకు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించిన పోలీసులు.. పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.
Pushp Vihar's Amrita School gets bomb threat via e-mail; Delhi police and other teams are present at the spot. Investigation underway: Delhi police
— ANI (@ANI) May 16, 2023
మెయిల్ అందడంతో పాఠశాలలో చెకింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు దక్షిణ జిల్లా డీసీపీ చందన్ చౌదరి తెలిపారు. అన్నిచోట్లా తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి ఎవరి ద్వారా పంపబడిందనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.