నిరసన తెలిపిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్‌ను న‌మోదు చేసిన‌ ఢిల్లీ పోలీసులు.. ఇప్పుడు దానిని ఉపసంహరించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మే 28న, భారతీయ శిక్షాస్మృతిలోని ప‌లు సెక్షన్ల కింద వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా రెజ్లర్ల నిరసన నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నిరసన తెలిపిన రెజ్లర్ల(Wrestlers)పై ఎఫ్‌ఐఆర్‌(FIR)ను న‌మోదు చేసిన‌ ఢిల్లీ పోలీసులు(Delhi Police).. ఇప్పుడు దానిని ఉపసంహరించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మే 28న, భారతీయ శిక్షాస్మృతిలోని ప‌లు సెక్షన్ల కింద వినేష్ ఫోగట్(Vinesh Phogat), సాక్షి మాలిక్(Sakshi Malik), బజరంగ్ పునియా(Bajrang Punia)తో సహా రెజ్లర్ల నిరసన నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌(Brij Bhushan Sharan Singh)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మే 28న ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర చేసేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రెజ్లర్లను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లపై సెక్షన్ 147, సెక్షన్ 149, 186, 188, 332, 353 కింద అభియోగాలు మోపారు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద కూడా నిరసనకారులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఎఫ్‌ఐఆర్‌పై వినేష్ ఫోగట్ స్పందిస్తూ.. కొత్త చరిత్ర లిఖించబడుతోందని అన్నారు. “లైంగిక వేధింపుల కింద బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి.. ఢిల్లీ పోలీసులకు ఏడు రోజులు పడుతుంది. కానీ శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఏడు గంటలు కూడా పట్టలేదు. దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా? ప్రభుత్వం తమ ఆటగాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. కొత్త చరిత్ర లిఖించబడుతోందని ట్వీట్(Tweet) చేశారు.

Updated On 15 Jun 2023 8:24 PM GMT
Yagnik

Yagnik

Next Story