ఢిల్లీలో(Delhi) ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మెట్రో ట్రాక్‌పై(Metro Track) నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రోస్టేషన్‌(Shadipur Metro station) నుంచి దూకేందుకు ట్రాక్‌పై ఓ యవతి వచ్చింది. అధికారులు, స్థానికులు మాటల్లో పెట్టి ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే..

దేశరాజధాని ఢిల్లీలో ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు ఆమె మెట్రోట్రాక్‌ను ఎంచుకుంది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రోస్టేషన్‌ నుంచి ట్రాక్‌పైకి వచ్చిన మహిళ అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె చేతిలో సెల్‌ఫోన్‌ కూడా ఉంది. మెట్రో రేలింగ్‌పై(Metro Railing) నుంచి కాలు పెడుతూ దూకేందుకు యత్నించింది. ఇంతలోనే మెట్రోట్రాక్‌ కింది నుంచి వెళ్తున్న పలువురు యువతిని గమనించి గుమికూడారు. ఇంతలోనే అధికారులు కూడా అక్కడికి చేరుకుని యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. తన దగ్గరికి ఎవరూ రావొద్దని వస్తే దూకేస్తానని ఆమె బెదిరించింది. ఆమెకు నచ్చజెప్పేందుకు చాలా సేపు అధికారులు, పోలీసులు(Police) ప్రయత్నించారు. ఎంత సముదాయించినా ఆమె మనసు మార్చుకోలేదు. మెల్లగా ఆ యువతిని మాటల్లో పెట్టిన అధికారులు, స్థానికులు.. తన దగ్గరకు వస్తున్న పోలీసులను గమనించలేకపోయింది. క్షణాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువతిని రక్షించి క్షేమంగా కిందికి తీసుకొచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో కారణాలను అన్వేషిస్తామని చెప్పారు. అలాగే మెట్రోట్రాక్‌కు ఎలా చేరుకుందో, మెట్రో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

Updated On 12 Dec 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story