పిల్లికి(Cat), పులికి(Tiger) తేడా తెలియకుండా సోమవారం అంతా టెలివిజన్‌ ఛానెళ్లు ఒకటే హడావుడి చేశాయి. దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ(Narendra Modi), ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం(Swearing Ceremony) చేస్తున్న సమయాన రాష్ట్రపతి భవనలో(rashtrapati bhavan) ఓ జంతువు కనబడింది. ఆ వీడియోను పొద్దస్తమానం వేస్తూ రకరకాల కథనాలు వండి వార్చారు.

పిల్లికి(Cat), పులికి(Tiger) తేడా తెలియకుండా సోమవారం అంతా టెలివిజన్‌ ఛానెళ్లు ఒకటే హడావుడి చేశాయి. దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ(Narendra Modi), ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం(Swearing Ceremony) చేస్తున్న సమయాన రాష్ట్రపతి భవనలో(rashtrapati bhavan) ఓ జంతువు కనబడింది. ఆ వీడియోను పొద్దస్తమానం వేస్తూ రకరకాల కథనాలు వండి వార్చారు. అది పులిననే కొందరు, అబ్బే ఏదో పెంపుడు జంతువులా ఉందని మరికొందరు, కాదు కాదు కచ్చితంగా అది పిల్లేనని ఇంకొందరు వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో చిరుతపులి ఎలా వస్తుందనే లాజిక్‌ను కూడా మర్చిపోయి తోచిన కథలు అల్లారు. దీనిపై సోమవారం ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చిన తర్వాత కథనాలకు పుల్‌స్టాప్‌ పడింది. స్టేజీ వెనకాల కనిపించిన జంతువు ప్రతి ఇంట్లో ఉండే సాధారణ పిల్లేనని, రాష్ట్రపతి భవన్‌లో పెంపుడు కుక్కలు, పిల్లులు మాత్రమే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి భవన్‌ ఎస్టేట్‌లో చిరుత పులి ఉన్నట్టు ఎలాంటి నివేదికలు లేవని అటవీ శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు

Updated On 11 Jun 2024 12:20 AM GMT
Ehatv

Ehatv

Next Story