కొద్దిరోజుల క్రితం ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో ఒక అమ్మాయి బికినీతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.. మెట్రోలో ఆమె వేషధారణ పై చాలా రకాల విమర్శలు వచ్చాయి మొత్తానికి అమ్మాయి అయితే పాపులారిటీ సొంతం చేసుకున్నది . మెట్రోలో బికినీ లో ప్రయాణిస్తున్న వీడియో నెట్ లో వైరల్ గా మారింది . వీడియోనే కాదు ఈమె డ్రెస్ పై చాలా రకాల వివాదకరమైన చర్చలు జరిగాయి.. నటి ఉర్ఫీ జావేద్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ అమ్మాయి ఇలాంటి డ్రెస్ వేసుకొని పాపులారిటీ కోసం చేసిన స్టంట్ అని చాలామంది ఘాటు వ్యాఖ్యలు చేశారు..
కొద్దిరోజుల క్రితం ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో ఒక అమ్మాయి బికినీతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.. మెట్రోలో ఆమె వేషధారణ పై చాలా రకాల విమర్శలు వచ్చాయి మొత్తానికి అమ్మాయి అయితే పాపులారిటీ సొంతం చేసుకున్నది . మెట్రోలో బికినీ లో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది . వీడియోనే కాదు ఈమె డ్రెస్ పై చాలా రకాల వివాదకరమైన చర్చలు జరిగాయి.. నటి ఉర్ఫీ జావేద్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ అమ్మాయి ఇలాంటి డ్రెస్ వేసుకొని పాపులారిటీ కోసం చేసిన స్టంట్ అని చాలామంది ఘాటు వ్యాఖ్యలు చేశారు..
మెట్రో యువతి పేరు రిథమ్ చనా(Rhythm Chanana) నా ఇంతకీ తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ అయితే లేదు పాపులర్టీ సంపాదించుకోవాలని ఆశ అయితే అసలే లేదు. ఉర్ఫీ జావేద్అంటే తనకి ఇప్పటి వరకు తెలియదని ఏమాత్రం చూడలేదని తన స్నేహితుడు ఆమె గురించి చెపితే ఆ తర్వాత మాత్రమే ఆమె గురించి వీడియోలు ఫోటోలు చూడడం జరిగిందని రిథమ్ చెప్పింది..
తన వైరల్ వీడియో గురించి మీడియాతో రిథమ్ మాట్లాడటం జరిగింది.. అసలు తన వేషధారణ గురించి వైరల్ అయిన విషయం గురించి రిథమ్ ఏమంటుంది అంటే..
ఏ ఉద్దేశంతో తన అలాంటి వేషధారణతో బయటకు వచ్చింది అని మీడియా ప్రశ్నలు అడగగా తను ఎలాంటి పబ్లిసిటీ స్టంట్ కోసం గానీ ఎలాంటి పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కానీ చేయలేదు అని తేల్చి చెప్పింది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అనే విషయాన్ని తను పట్టించుకోను అని చాలా క్యాజువల్ గా చెప్పేసింది..
తనదైన తరహాలో పాటలతో ఆటపాటలతో అలరిస్తూ రీల్స్ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంది తను సొంతంగా బ్రతకడం కోసం తనకి ఇష్టమైనట్లే బ్రతకడం కోసం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా బయటకు వచ్చేసి బ్రతుకుతుంది .. అప్పటినుంచి ఒక్కతే తనకి ఇష్టమైనట్లుగానే బ్రతుకుతుంది తన వేషధారణ తన మాట తీరు ఏదైనా కావచ్చు ప్రతిదీ తనకు నచ్చినట్లు మాత్రమే చేస్తుంది కానీ ఎవరిని మెప్పించడం కోసం కానీ పబ్లిసిటీ కోసం కానీ తను ఇలాంటి పనులు చేయను అని తేల్చి చెప్పేసింది..
రిథమ్ కొన్నాళ్ల క్రితం మెట్రో రైల్లో బ్యాక్ ప్యాక్ తో బికినీలో కూర్చుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తను కూర్చున్న విధానాన్ని తను వేసుకునే డ్రెస్ ని మెట్రోలో ఒక యువకుడు వీడియో తీసి నెట్ లో షేర్ చేశాడు ఇంకేముంది ఈ విషయం పైన పెద్ద దుమారమే లేచింది..రిథం వేషధారణతో ఢిల్లీ మెట్రో విషయం అంతగా వైరల్ అయింది ఈ టాపిక్
డైలీ మెట్రో రైల్ లో సొసైటీ లో మర్యాద పూర్వకంగా ఒక ప్రోటోకాల్ తో నడుచుకోవాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి ప్రవర్తన చేయకూడదని ఒక రూల్ అయితే పాస్ చేసింది . డి ఎం ఆర్ పి యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సెక్షన్ 59 ప్రకారం అసభ్యత అనేది శిక్షారమైన నేరంగా ప్రకటన చేయబడుతుందని ఒక సంచలన ప్రకటన చేసింది..
ఈ విషయం గురించి రిథమ్ని మీడియా ప్రశ్నించగా మెట్రోలో అలాంటి డ్రెస్ వేసుకోవడం అభ్యంతరకరమైతే అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి తన స్వేచ్ఛను భంగపరుస్తూ తన అనుమతి లేకుండా వీడియో తీసి దాన్ని నెట్లో పెట్టడం కూడా శిక్షార్హమైన పనే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించిధీటుగా సమాధానం చెప్పింది..