అప్పుడెప్పుడో అంటే 22 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన కన్నకొడుకు తిరిగివస్తే ఆ తల్లి ఎంత సంబరపడతుందో కదా! కానీ ఆ సంబరమంతా మూన్నాళ్ల ముచ్చటే అని తెలిస్తే ..ఇదే జరిగింది ఢిల్లీలో(Delhi) ఉంటున్న రతీపాల్‌సింగ్, భానుమతి దంపతులకు! 2002లో పింకు(Pinku) తండ్రితో గొడవపడ్డాడు. అప్పుడు పింకు వయసు 11 ఏళ్లు. తండ్రితో తగాదా పెట్టుకున్నందుకు తల్లి భానుమతి తిట్టింది. అంతే పింకుకు కోపం వచ్చేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం అంతా గాలించారు.
అప్పుడెప్పుడో అంటే 22 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన కన్నకొడుకు తిరిగివస్తే ఆ తల్లి ఎంత సంబరపడతుందో కదా! కానీ ఆ సంబరమంతా మూన్నాళ్ల ముచ్చటే అని తెలిస్తే ..ఇదే జరిగింది ఢిల్లీలో(Delhi) ఉంటున్న రతీపాల్‌సింగ్, భానుమతి దంపతులకు! 2002లో పింకు(Pinku) తండ్రితో గొడవపడ్డాడు. అప్పుడు పింకు వయసు 11 ఏళ్లు. తండ్రితో తగాదా పెట్టుకున్నందుకు తల్లి భానుమతి తిట్టింది. అంతే పింకుకు కోపం వచ్చేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం అంతా గాలించారు. పోలీసులు కూడా వెతికి వెతికి కేసు క్లోజ్ చేశారు. అయితే కొడుకు ఎప్పటికైనా తిరిగివస్తాడన్న నమ్మకం భానుమతిలో ఉండింది. ఆ నమ్మకం 22 ఏళ్ల తర్వాత ఫలించింది. అమేథిలోని తన సొంత ఊరు ఖరౌలి గ్రామానికి వచ్చాడు పింకు. అతడిని గుర్తుపట్టిన స్థానికులు ఢిల్లీలో ఉంటున్న అతడి తల్లిదండ్రులకు కబురందించారు. ఈ సంతోషకరమైన వార్త విని రతీపాల్‌సింగ్, భానుమతి పరుగున వచ్చారు. పింకు శరీరంపై ఉన్న మచ్చను చూసి గుర్తుపట్టారు. ఆనందభాష్పాలు రాల్చారు. ఆలింగనం చేసుకున్నారు. అయితే ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. సన్యాసిలా(monk) మారిపోయిన తమ కొడుకు పరిస్థితి చూసి ఆవేదన చెందారు. ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్న కొడుకును చూసి కలత చెందారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఓదార్చారు. ఓ సన్యాసిగా తల్లి నుంచి భిక్షను స్వీకరించే కర్మను పూర్తి చేయాల్సి ఉంటుందని, అది పూర్తి చేయడానికే తాను ఇక్కడికి వచ్చానని పింకు చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు. చెట్టంత కొడుకు, చేతికి అందివచ్చిన కొడుకు ఇలా తమను విడిచి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. మరో షాకింగ్ వార్త ఏమిటంటే పింకుకు చెందిన మతపరమైన విభాగం అతడిని వదిలిపెట్టడానికి 11 లక్షల రూపాయలు అడుగుతున్నదట! 11 రూపాయలు కూడా లేని తాము అంత సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చేది అని పింకు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.