ఢిల్లీలో(Delhi) ఓ కుటుంబమంతా కలిసి సంతోషంగా దీపావళి(diwali) పండగ చేసుకున్నారు
ఢిల్లీలో(Delhi) ఓ కుటుంబమంతా కలిసి సంతోషంగా దీపావళి(diwali) పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆకాష్ శర్మ అనే వ్యక్తి ఇంటి బయట దీపావళి పటాకులు పేల్చుతున్న సందర్భంగా ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు అతనికి కాళ్లు మొక్కి ఆ తర్వాత తుపాకీ(Gun) తీసి కాల్చి చంపారు. ఈ విషాద ఘటన షహదర ప్రాంతంలో(shahadara) చోటుచేసుకుంది. సీసీ ఫుటేజ్‌లో ఈ హత్య దృశ్యాలు రికార్డ్‌కాగా ఇప్పుడు అవి వైరలవుతున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి ఆకాశ్ శర్మ (44), తన కుమారుడు, మేనల్లుడితో(Nephew) కలిసి ఇంటి బయట దీపావళి టపాకాయలు కాలుస్తున్నారు. ఆ సమయంలోనే అటుగా బైక్‌పై(Bike) వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి ముందు ఆగారు. అందులో ఓ టీనేజర్ శర్మ కాళ్లకు నమస్కరించి అతడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. పక్కనే నిలబడిన మరో వ్యక్తి వెంటనే తుపాకీ తీసుకొని కాల్పులు జరపడంతో శర్మ అక్కడిక్కడే చనిపోయాడు. వెంటనే తేరుకున్న మేనల్లుడు పారిపోతున్న షూటర్లను వెంబడించాడు. దాంతో నిందితులు అతడిపైనా కాల్పులు జరిపారు. దాంతో ఆ పిల్లాడు చనిపోయాడు. నమ్మించి మరీ ఈ హత్యకు పాల్పడటంతో అక్కడున్నవారు ఆందోళన చెందారు. గాయాలపాలైన శర్మ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవ జరుగుతోందని తెలుస్తోంది. ద్విచక్రవాహనంపై వచ్చిన టీనేజర్.. డబ్బు అప్పుగా అభిషేక్ శర్మకు ఇచ్చాడని, అభిషేక్ శర్మ దానిని తిరిగి ఇవ్వలేదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి మృతుడిపై ఇదివరకే కేసు నమోదైందని అన్నారు. ఈ కేసులో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కోసం అతడు షూటర్‌కు సుపారీ ఇచ్చాడని వెల్లడించారు.