కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు వెలువరించనుంది.

కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. సోమవారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో ట్రయల్ కోర్టు ఆదేశాలను తప్పుగా పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఉపశమనం కలిగించకూడదని కోరింది.

జూన్ 20న కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 21న కేజ్రీవాల్‌కుమంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ ఈడీ పిటిష‌న్‌లో పేర్కొంది.

శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌ను విచారించిన వెకేషన్ జడ్జి జస్టిస్ జైన్ ఈడీ స్టే దరఖాస్తుపై నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తూ.. ఆర్డర్ ప్రకటించే వరకు స్టే విధించారు. దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి కూడా ఉపశమనం లభించలేదు. ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ జూన్ 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ అంశంపై ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు అసాధారణమని ధర్మాసనం పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ.. హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు వెలువరించవచ్చని వాదించారు.

కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మేలో సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయ‌న‌ జూన్ 2న లొంగిపోయాడు.

Eha Tv

Eha Tv

Next Story