పలు చానెళ్లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
తనపై నిరాధారమైన వార్తలు ప్రసారం చేశారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(Andhra Jyoti), మహాన్యూస్(Mahanews), టీవీ5(TV5), ఈటీవీ(ETv), ఆర్‌టీవీ(RTV) సహా 9 మందిపై పరువునష్టం దావాను ఢిల్లీ హైకోర్టులో విజయసాయిరెడ్డి(Vijay Sai reddy) దాఖలు చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రచురించారని పిటిషన్‌లో విజయసాయి పేర్కొన్నారు. విజయసాయి పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు(Delhi high court) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ, టీవీ5, ఈటీవీ ఆర్‌టీవీలను ప్రతివాదులగా చేర్చింది. ప్రతివాది యొక్క వాంగ్మూలాలు ప్రాథమికంగా పరువు నష్టం కలిగించేవిగా, విశ్వసనీయమైన సాక్ష్యాలు లేవని పుకార్ల ఆధారంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయ పడింది. నిర్ణీత గడువులోపు పరువు నష్టం కలిగించే కంటెంట్‌కు యాక్సెస్‌ను తీసివేయాలని లేదా బ్లాక్ చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ప్రసారాలను నిరోధించాలని ఆదేశించింది.
నిరాధారమైన పరువు నష్టం కలిగించే వార్తలను కవర్ చేయకూడదని, పిటిషనర్ గౌరవానికి, రాజకీయ జీవితానికి విఘాతం కల్గించేలా ప్రసారాలు ఉండకూడదని తెలిపింది. వాక్ స్వాతంత్ర్యాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌లో కోర్టు తీర్పును పోస్టు చేశారు.