ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి(Delhi Excise Policy Scam) సంబంధించి ఈడీ(ED) కేసులో మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్‌ను(Bail Petition) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(Am Admi Party) మాజీ కమ్యూనికేషన్ డైరెక్టర్ విజయ్ నాయర్(Vijay Nayr),

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి(Delhi Excise Policy Scam) సంబంధించి ఈడీ(ED) కేసులో మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్‌ను(Bail Petition) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(Am Admi Party) మాజీ కమ్యూనికేషన్ డైరెక్టర్ విజయ్ నాయర్(Vijay Nayr), హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి(Abhishek Boinapally), బినోయ్ బాబు(Binoy Babu) (మద్యం కంపెనీ ఎం/ఎస్ పెర్నోడ్ రికార్డ్ మేనేజర్) బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన రూస్ అవెన్యూ కోర్టు నిర్ణయాన్ని మనీష్‌తో సహా నిందితులందరూ సవాలు చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విషయంలో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్(Money laundering) కేసులో మనీష్ సిసోడియాను మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 26న మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా పాత్రపై 8 గంటల విచారణ తర్వాత ఆయ‌న‌ను సీబీఐ(CBI) అరెస్టు చేసింది. మే 30న సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేయ‌గా.. మ‌ళ్లీ చుక్కెదురైంది.

Updated On 3 July 2023 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story