మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో(Money Laundring Case) అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvindh Kejriwal) ఢిల్లీ హైకోర్టు(Delhi high court) షాకిచ్చింది.
మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో(Money Laundring Case) అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvindh Kejriwal) ఢిల్లీ హైకోర్టు(Delhi high court) షాకిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్(Bail) మంజూరుచేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. గురువారం సాయంత్రం కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ లభించింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ (ED) చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఇవాళ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల అవ్వాల్సి ఉండింది. కానీ ఈడీ హైకోర్టును ఆశ్రయించడంతో సీన్ రివర్స్ అయ్యింది.