విప‌క్ష కూటమికి ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court) షాకిచ్చింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ కూట‌మికి I-N-D-I-A (Indian National Developmental Inclusive Alliance) అనే సంక్షిప్త పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని దాఖ‌లైన‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం.. 26 రాజకీయ పార్టీలకు, భారత ఎన్నికల కమిషన్‌కు(Election Commission) నోటీసు జారీ చేసింది.

న్యాయవాది వైభవ్ సింగ్ ద్వారా ఉద్యమకారుడు గిరీష్ భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం ప్రతిస్పందనను చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ నరులాతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అరుణా శ్యామ్ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణకై అక్టోబర్ 31లోపు నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని కోరింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చేతన్ శర్మ వాదనలు వినిపించి.. గడువు తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ కూడా తక్షణ ఉపశమనం కోసం అభ్య‌ర్ధించారు. I-N-D-I-A ప‌దాన్ని ఉపయోగించకుండా ప్రతిప‌క్ష‌ పార్టీలను ఆపాలని.. ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

"మాకు చాలా కేసులు ఉన్నాయి. వారు స్పందించనివ్వండి. మేము దానిని ఖచ్చితంగా పరిశీలిస్తాము" అని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ వ్యాఖ్యానించారు.

Updated On 4 Aug 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story