తన భర్త రోజూ తనను హింసిస్తున్నాంటూ ఓ భార్యామణి కోర్టుకెక్కింది. అబ్బే తానేమీ హింసించడం లేదని, కేవలం ఇంటి పని చేయమని మాత్రమే చెప్పానని అంటున్నాడు భర్త. అలా చెప్పడం కూడా గృహహింసేనని వాదిస్తోంది ఆ భార్య. ఈ ఇన్సిడెంట్ ఢిల్లీ(Delhi)లో జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. మరుసటి ఏడాది వారికో కొడుకు కూడా పుట్టాడు. పెళ్లయినప్పట్నుంచి భార్య ఇంటి పనే చేయడం లేదట!

తన భర్త రోజూ తనను హింసిస్తున్నాంటూ ఓ భార్యామణి కోర్టుకెక్కింది. అబ్బే తానేమీ హింసించడం లేదని, కేవలం ఇంటి పని చేయమని మాత్రమే చెప్పానని అంటున్నాడు భర్త. అలా చెప్పడం కూడా గృహహింసేనని వాదిస్తోంది ఆ భార్య. ఈ ఇన్సిడెంట్ ఢిల్లీ(Delhi)లో జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. మరుసటి ఏడాది వారికో కొడుకు కూడా పుట్టాడు. పెళ్లయినప్పట్నుంచి భార్య ఇంటి పనే చేయడం లేదట! చేయమన్న ప్రతీసరా ఇంటి పని చేయడం తన హక్కులకు విరుద్ధమని చెప్పేదట! ఈ విషయంపై చాలా సార్లు భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు కొడుకును కూడా చూడనివ్వకుండా ఆంక్షలు పెట్టింది. ఇహ లాభంలేదనుకున్న భర్త ఫ్యామిలీ కోర్టు(Family Court)ను ఆశ్రయించాడు. దయచేసి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును వేడుకున్నాడు. ఫ్యామిలీ కోర్టు భార్య వాదననే సమర్థించింది. ఇంటి పని చేయమని చెప్పడం గృహహింస కిందకు వస్తుందని చెప్పింది. దాంతో భర్త హైకోర్టు(High Court)కు వెళ్లాడు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భర్తకు సపోర్ట్ చేసింది. భార్య వైఖరిని తప్పుపట్టింది. వివాహితను ఇంటిపని చేయమంటే ఆమెను పనిమనిషి కింద చూసినట్టు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటి పని చేయడమంటే కుటుంబం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేయడమేనని తెలిపింది. బరువు బాధ్యతలను భార్యభర్తలిద్దరూ సమంగా పంచుకోవాలని సలహా ఇచ్చింది. భర్తకు దూరంగా భార్య పుట్టింటిలో ఉండటంపై అభ్యంతరం తెలిపింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. భర్తకు విడాకులు మంజూరు చేసింది.

Updated On 8 March 2024 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story