ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia)కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దినేష్ కుమార్ శర్మ(Justice Dinesh Kumar Sharma)తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు ఇస్తూ..
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia)కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దినేష్ కుమార్ శర్మ(Justice Dinesh Kumar Sharma)తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు ఇస్తూ.. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. ప్రభావవంతమైన పదవిలో ఉన్నారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు 18 శాఖలుండేవి. ఆయన ప్రవర్తన కూడా బాగాలేదు. సాక్షులలో ఎక్కువ మంది ప్రభుత్వ సేవకులే కాబట్టి.. సాక్ష్యాలను తారుమారు చేయడాన్ని తోసిపుచ్చలేము. అందుకే ఇప్పుడు బెయిల్ ఇవ్వడం కుదరదని పేర్కొంది.
మార్చి 31న ట్రయల్ కోర్టు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సిసోడియా హైకోర్టులో సవాలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను సీబీఐ.. కోర్టులో వ్యతిరేకించింది. ఎక్సైజ్ కుంభకోణంలో మనీష్ సిసోడియా ప్రధాన సూత్రధారి అని సీబీఐ పేర్కొంది. అతను నేరపూరిత కుట్రలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించినట్లు కోర్టుకు తెలిపింది. దీంతో మే 11న హైకోర్టు పిటిషన్‌పై నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. హైకోర్టు ప్రస్తుత తీర్పుపై మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రిమాండ్‌పై ఉన్న అతడిని సీబీఐ విచారించి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపింది. ఆ తర్వాత ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈడీ మార్చి 9న సిసోడియాను అరెస్ట్ చేసింది.