ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 2020 సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాజ్యాంగాన్ని సవరించి 'ఇండియా' అనే పదాన్ని భారత్ లేదా హిందూస్తాన్‌తో భర్తీ చేయాలన్న వ్యాఖ్యలను పట్టించుకోకపోవడంపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసంది. పిటిషనర్ వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం అమలు చేయాలని ఆదేశించింది. ఇండియా అనే పేరు వలసవాద వారసత్వం అని, భారత్ అనే పేరు దేశ చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబం అని పిటిషనర్ కోర్టుకు విన్నవించుకున్నారు. 2020లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషన్‌లో ఆరోపించారు. పేరు మార్పు కోసం అనేక అభ్యర్థనలు వచ్చినా ప్రభుత్వాలు విస్మరించాయని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇండియా అనే పేరు వలస వారసత్వం అని, ఇది దేశ నాగరికత నైతికతకు విరోధంగా ఉందని, అయితే భారత్ దాని సాంస్కృతిక, చారిత్రక గుర్తింపుతో చొచ్చుకుపోయిందని కోర్టులో వాదించారు. భారత్ అనేది మన దేశపు ఏకైక పేరు అని నిర్ధారించడం ద్వారా ఇండియా స్థానంలో భారత్ లేదా హిందూస్థాన్ పెట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. 2020లో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించేలా చూడాలని విన్నవించుకున్నారు. పిటిషన్ నమహా తరఫు సీనియర్ న్యాయవాది సంజీవ్ సాగర్ వాదలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు.. ఇండియా స్థానంలో భారత్ లేదా హిందూస్థాన్ అని పెట్టాల్సిందిగా సుప్రీంతీర్పును అనుసరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది
