కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. అదే సమయంలో ఢిల్లీ(delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) ఊరటనిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై కంట్రోల్‌ ఎవరికి ఉండాలన్న వివాదంలో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంవైపే నిలుచుకుంది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారులు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. అదే సమయంలో ఢిల్లీ(delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) ఊరటనిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై కంట్రోల్‌ ఎవరికి ఉండాలన్న వివాదంలో సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంవైపే నిలుచుకుంది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారులు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారులు లేవన్న గత తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని అయిదురుగు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కట్టుబడి ఉండాలని కూడా ధర్మాసనం తెలిపింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

Updated On 11 May 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story