దేశ రాజధాని ఢిల్లీని(Delhi) వాయు కాలుష్యం(Air Pollution) వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న వాయు నాణ్యతతో(air quality) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాస(Breathing) తీసుకోవడం ఇబ్బందిగా మారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నగరాన్ని పూర్తిగా పొగమంచు కమ్మేసింది. కాలుష్యం మరోసారి అత్యంత తీవ్రం కేటగిరీలోకి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీని(Delhi) వాయు కాలుష్యం(Air Pollution) వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న వాయు నాణ్యతతో(air quality) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాస(Breathing) తీసుకోవడం ఇబ్బందిగా మారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నగరాన్ని పూర్తిగా పొగమంచు కమ్మేసింది. కాలుష్యం మరోసారి అత్యంత తీవ్రం కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(AQI) శనివారం సాయంత్రం నాలుగు గంటలకు 415 ఉంటే, ఆదివారం ఉదయం ఏడు గంటలకు 460గా దిగజారింది. ముందు జాగ్రత్తగా ప్రాథమిక పాఠశాలలకు(Primary school) సెలవులను మరో అయిదు రోజుల పాటు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. పొరుగు రాష్ట్రాలు అయిన పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థ్యాలను తగులబెడుతుండటంతో పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ఢిల్లీలో వాయు నాణ్యత బాగా పడిపోయింది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉందని తేలింది. వాయు కాలుష్యం బాగా పెరుగుతుండంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో రవాణా వాహనాలను, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది.