మన హైదరాబాద్‌లో(Hyderabad) కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ను(Kumari aunty Food) పోలీసులు మూసేయడం, తర్వాత ప్రభుత్వం కల్పించుకుని మళ్లీ తెరవడం .. ఇవన్నీ తెలిసిన విషయాలే! ఈ ఎపిసోడ్‌తో కుమారి ఆంటీ బాగా పాపులరయ్యింది. ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఢిల్లీలో(Delhi) జరిగింది. చంద్రిక దీక్షిత్(Chandrika Dixit) అనే యువతి కొన్నాళ్లుగా ఢిల్లీలోని మంగోల్‌పురి(Mangolpuri) ప్రాంతంలో వడపా్ ఫుడ్‌స్టాల్(Vadapav Food stall) నడుపుతోంది.
మన హైదరాబాద్‌లో(Hyderabad) కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ను(Kumari aunty Food) పోలీసులు మూసేయడం, తర్వాత ప్రభుత్వం కల్పించుకుని మళ్లీ తెరవడం .. ఇవన్నీ తెలిసిన విషయాలే! ఈ ఎపిసోడ్‌తో కుమారి ఆంటీ బాగా పాపులరయ్యింది. ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఢిల్లీలో(Delhi) జరిగింది. చంద్రిక దీక్షిత్(Chandrika Dixit) అనే యువతి కొన్నాళ్లుగా ఢిల్లీలోని మంగోల్‌పురి(Mangolpuri) ప్రాంతంలో వడపా్ ఫుడ్‌స్టాల్(Vadapav Food stall) నడుపుతోంది. ఆమెకు వడపావ్ గర్ల్(Vadapav Girl) అని పేరు కూడా పెట్టేశారు. ఆమె ఆ పేరుతోనే పాపులరయ్యింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్టాల్ దగ్గర యువతికి స్థానికుల మధ్య వివాదం జరిగినట్టు ఆ వీడియోలో ఉంది. స్టాల్‌ను తొలగించాలని చెప్పిన మున్సిపల్ అధికారులతో ఆమె గొడవకు దిగింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చంద్రిక దీక్షిత్ ఫుడ్‌స్టాల్‌ను స్థానిక మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వల్లనే ఆమె స్టాల్ దగ్గరకు ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, దీనివల్ల స్థానికంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని పోలీసులు తెలిపారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న చుట్టపక్కల వాళ్లు తమకు కంప్లయింట్ చేశారని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై పోలీసు సిబ్బంది ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె దురుసగా ప్రవర్తించిందట! అందుకే ఫుడ్‌స్టాల్‌ను సీజ్ చేసి, ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీసులు అంటున్నారు.