దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు నోడల్ అధికారులను నియమించాలని ప్రధాన ఎన్నికల కార్యాలయం MCD(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ)ని ఆదేశించింది

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు నోడల్ అధికారులను నియమించాలని ప్రధాన ఎన్నికల కార్యాలయం MCD(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ)ని ఆదేశించింది. ఇది కాకుండా.. MCD తన ఉద్యోగులకు ఎన్నికల సంబంధిత శిక్షణను అందించాలని కూడా ఆదేశాల‌లో పేర్కొంది. మరోవైపు ప్రధాన ఎన్నికల కార్యాలయం ఆదేశాల మేరకు ఎంసీడీ చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడమే ఈ కసరత్తు వెనుక కారణమని భావిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగియనుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ప్రతి విషయంలోనూ MCD కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగా అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాల్సిందిగా ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ఎంసీడీని ఆదేశించింది.

MCD ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన వివిధ పనులకు నోడల్ అధికారులను నియమించాలని.. ఎన్నికల పనులకు సంబంధించి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని కూడా ప్రధాన ఎన్నికల కార్యాలయం ఆదేశించింది. దీంతో నోడల్ అధికారులను నియమించడంతో పాటు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ఆదేశాలతో.. MCD లో అసెంబ్లీ ఎన్నికల సమయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ఈ కారణంగా ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఇప్పటి వరకూ ఎప్పుడు కూడా ఆరు-ఏడు నెలల ముందుగానే ఎన్నికలకు సన్నాహాలు చేయలేదు. దీంతో ఢిల్లీ అసెంబ్లీకి ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవ‌కాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అవ‌కాశం లేదు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story