ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish sisodiya) జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. అలాగే చదువు నిమిత్తం కుర్చీ, టేబుల్ సమకూర్చాలన్న ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish sisodiya) జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. అలాగే చదువు నిమిత్తం కుర్చీ, టేబుల్ సమకూర్చాలన్న ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మనీష్ సిసోడియాతో పాటు మరో ముగ్గురిపై సీబీఐ అనుబంధ ఛార్జిషీటుపై ఢిల్లీ కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. సిసోడియాతో పాటు అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, అమన్‌దీప్ ధాల్‌ల పేర్లు ఛార్జ్ షీట్‌లో ఉన్నాయి. ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. నాగ్‌పాల్ మే 27న ఆర్డర్‌ను ప్రకటించనున్నారు.