ఆర్ధిక నేరగాడు.. గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ తో క్లోజ్ గా ఉండటంతో.. అతను చేసిన 200 కోట్ల మనీలాండరింగ్ కేసు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కూడా చుట్టుకుంది. ఈ నేరంలో ఆమె పేరు సైతం ఉండటం.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు(Delhi Court)లో ఆమె వేసిన పిటీషన్ నువిచారించిన ధర్మాసనం ఈడీకి నోటీసులిచ్చింది.
ఆర్ధిక నేరగాడు.. గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ తో క్లోజ్ గా ఉండటంతో.. అతను చేసిన 200 కోట్ల మనీలాండరింగ్ కేసు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కూడా చుట్టుకుంది. ఈ నేరంలో ఆమె పేరు సైతం ఉండటం.. అతనితో కలిసి ఆమె కూడా నేరాల్లో పాలు పంచుకుని ఉంటుందన్న ఆరోపణలతో.. ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలుసార్లు విచారించింది. మనీలాండరింగ్ కేసు సంబంధించి ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను రద్దు చేయాలని శ్రీలంకన్ బ్యూటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇక ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ జక్వెలిన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను గురువారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో ఈడీ స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జ్యోతిసింగ్ ఈడీకి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణను జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది.అయితె జాక్వెలిన్ పై సరైన ఆధారాలు లేవని. కాని ఆమెను నిందుతురాలిగా చేర్చడంపై ఆమె అభ్యంతరం తెలిపింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌తో పాటు ఈడీ ఛార్జ్ షీట్లను కొట్టివేయాలని జాక్వెలిన్ పిటిషన్‌లో పేర్కొంది.
తనను సాక్షిగా మాత్రమే విచారించకుండా.. నిందితురాలిగా ట్రీట్ చేయడంపై ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇక ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలు ఉన్నాడు. అతనిపై 30కిపైగా కేసులు నమోదయ్యాయి. జైల్లో ఉంటూనే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అధికారిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య నుంచి ఏకంగా 215 కోట్లు కొల్లగొట్టాడు. ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు.