జూన్ 23న బీహార్(Bihar) సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) అధ్యక్షతన పాట్నాలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కేంద్రం ఆర్డినెన్స్‌పై(Center Ordinance) చర్చించేందుకు ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM kejriwal) అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 23న ఢిల్లీ ఆర్డినెన్స్‌పై తప్పనిసరిగా చర్చ జరగాలని మంగళవారం నుంచి ముఖ్యమంత్రి విపక్షాలకు పదేపదే విజ్ఞప్తి చేశారు.
జూన్ 23న బీహార్(Bihar) సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) అధ్యక్షతన పాట్నాలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కేంద్రం ఆర్డినెన్స్‌పై(Center Ordinance) చర్చించేందుకు ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind kejriwal) అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 23న ఢిల్లీ ఆర్డినెన్స్‌పై తప్పనిసరిగా చర్చ జరగాలని మంగళవారం నుంచి ముఖ్యమంత్రి విపక్షాలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీలకు లేఖ కూడా రాశారు. జూన్ 23న బీహార్‌లో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను ఓడించడంపై తొలి చర్చ జరగాలని కేజ్రీవాల్ ఈ లేఖలో కోరారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ ఒక ప్రయోగమని, అది విజయవంతమైతే, బీజేపీయేతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌లను తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తొలగిస్తుందని కేజ్రీవాల్ లేఖలో రాశారు. 33 రాష్ట్రాల గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్ల ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నడిపించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.