ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు కార్చారు. తన సహచరుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ఢిల్లీ నగరంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్ ప్రసంగిస్తూ..'మనీశ్ సిసోడియా ఇది ప్రారంభించారు. ఇవాళ ఆయనను ఎంతో మిస్ అవుతున్నా. విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలు అమోఘం. చిన్నారులందరికీ మెరుగైన విద్యను అందించాలన్నది ఆయన కల.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు కార్చారు. తన సహచరుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ఢిల్లీ నగరంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్ ప్రసంగిస్తూ..'మనీశ్ సిసోడియా ఇది ప్రారంభించారు. ఇవాళ ఆయనను ఎంతో మిస్ అవుతున్నా. విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలు అమోఘం. చిన్నారులందరికీ మెరుగైన విద్యను అందించాలన్నది ఆయన కల. అందుకోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడం వంటివి చేశారు. బహుశా అందుకేనేమో ఇవాళ ఆయనను జైలులో పెట్టారు' అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను నాశనం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని. అలా ఎప్పటికీ జరగనివ్వబోమని కేజ్రీవాల్ అన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఓ మంచి మనిషిని జైలుకు పంపించింది బీజేపీ. ఒకవేళ ఆయన గనుక మంచి చేసి ఉండకపోతే.. జైలుకు వెళ్లి ఉండేవారు కాదేమోనని అన్నారు. ఆయన చేసిన మంచి.. వాళ్లకు కంటగింపుగా మారింది అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు.