ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఆదివారం సీబీఐ(CBI) ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌(Bhagwant Mann)తో కలిసి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ(Mahatma Gandhi) సమాధి వద్దకు చేరుకుని నివాళుల‌ర్పించారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఆదివారం సీబీఐ(CBI) ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌(Bhagwant Mann)తో కలిసి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ(Mahatma Gandhi) సమాధి వద్దకు చేరుకుని నివాళుల‌ర్పించారు. సీబీఐ ప్రశ్నించడం, నిర్బంధించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతామన్నారు. సీబీఐని బీజేపీ వాళ్లే నియంత్రిస్తున్నారని ఆరోపించారు.

ఎక్సైజ్ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్(Ram Nivas Goel), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఎంపీ రాఘవ్ చద్దా, విద్యాశాఖ మంత్రి అతిషి, ఇతర ఆప్ నేతలు సీబీఐ ప్రధాన కార్యాలయం (లోధీ రోడ్) దగ్గర ధర్నాకు దిగారు. కాశ్మీర్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు దాదాపు ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ, "శ్రీకృష్ణుడు తనను అంతం చేస్తాడని కంసుడికి తెలుసు కాబట్టి, కంసుడు అన్ని ప్రయత్నాలు చేసాడు, శ్రీ కృష్ణుడికి హాని కలిగించడానికి కుట్ర చేశాడు, కానీ అతని జుట్టును కూడా విడిచిపెట్టలేదు." అదేవిధంగా ఆప్ చేతిలో బీజేపీ పతనం జరుగుతుందని అన్నారు.

Updated On 16 April 2023 5:19 AM GMT
Yagnik

Yagnik

Next Story