ఈ నెల 13వ తేదీన రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్(Delhi Chalo March)కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇప్పటికే ఆంక్షలు విధించింది. రైతుల(Formers)ను అడ్డుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. పంజాబ్ నుంచి ఢిల్లీ(Punjab To Delhi) వరకు హై అలర్ట్(High Allert)ను ప్రకటించింది.
ఈ నెల 13వ తేదీన రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్(Delhi Chalo March)కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇప్పటికే ఆంక్షలు విధించింది. రైతుల(Formers)ను అడ్డుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. పంజాబ్ నుంచి ఢిల్లీ(Punjab To Delhi) వరకు హై అలర్ట్(High Allert)ను ప్రకటించింది. పంజాబ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారు ఢిల్లీ చేరుకోకుండా హర్యానా ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోంది. వారి ప్రయాణించే దారిలోని ప్రతి కూడలిలో భద్రతను కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు. చౌధరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, దబ్వాలి, గురుగోవింద్‌సింగ్ స్టేడియంలను ఇప్పటికే తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. హర్యానాలోని 15 జిల్లాలలో సెక్షన్ 144ను విధించారు. ఏడు జిల్లాలలో ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఇంటర్నెట్‌ను బంద్ చేశారు. డ్రోన్ల సాయంతో అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పదునైన ముళ్ల తీగలను అమర్చారు. ఎలాగైనా సరే ఢిల్లీ చలో మార్చ్ సక్సెస్ కాకూడదన్నది కేంద్ర ప్రభత్వం ఆలోచన. ఇదిలా ఉంటే రైతుల నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఈ రోజు ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు.