☰
✕
దీపావళి పండుగ వస్తున్నదంటే చాలు ఢిల్లీ వాసులు భయంతో బిగదీసుకుంటారు.
x
దీపావళి పండుగ వస్తున్నదంటే చాలు ఢిల్లీ వాసులు భయంతో బిగదీసుకుంటారు. కారణం కాలుష్యం. కొన్ని రోజులుగా అక్కడ పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతి రోజూ 300 దాటుతోంది. ఇవాళ ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. రాబోయే మూడు రోజుల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా వాయు కాలుష్యం బాగా పెరిగింది. దీనికి తోడు బాణాసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగే ఛాన్సు ఉంది.
ఢిల్లీ ప్రభుత్వం క్రాకర్స్‌ను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. ఢిల్లీ(Delhi)లో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి.
ehatv
Next Story