దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వాయు కాలుష్యం ఎప్పుడూ ఉండేదే కానీ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. వాయు నాణ్యత సూచీ 302కు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు ఎయిర్‌ క్వాలిటీ(Air Quality) సూచి (AQI) 200 నుంచి 300 మధ్య ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వాయు కాలుష్యం ఎప్పుడూ ఉండేదే కానీ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. వాయు నాణ్యత సూచీ 302కు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు ఎయిర్‌ క్వాలిటీ(Air Quality) సూచి (AQI) 200 నుంచి 300 మధ్య ఉంటుంది. పండుగల వేళ ఢిల్లీలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి(Diwali) ముందే ఢిల్లీ పరిస్థితి ఇలా ఉంటే పండుగ తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది.

ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. ప్రజలు సొంత వాహనాలు ఇంట్లో పెట్టేసి ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను(Personal Vehicles) ప్రజలు వినియోగించకుండా ఉండేందుకు పార్కింగ్‌ ఫీజులు(Parking Fee) పెంచాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. అలాగే ఎలక్ట్రిక్‌ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, నూతన ఆంక్షలు విధించే అవకాశముందని సమాచారం.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్‌-III, బీఎస్‌-IV వాహనాలను పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది. అత్యవసర సేవల వాహనాలపై కూడా పరిమితులు విధించే అవకాశముంది. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను అధికారులు నిలిపివేసే అవకాశాలున్నాయి. కాలుష్య పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటే హైవేలు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్‌లైన్ల పనులు కూడా నిలిచిపోనున్నాయి. విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలున్నాయి.

వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములా తిరిగి అమలు చేసే అవకాశముంది. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేసేవిధంగా అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే కొన్ని సంస్థలలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గురువారం నుంచి రెడ్‌లైట్‌ ఆన్‌..

గాడీ ఆఫ్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నారు. రోడ్లపై రెడ్‌లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్‌ను ఆఫ్‌ చేయాల్సి ఉంటుంది. గ్రీన్‌ సిగ్నల్‌ పడిన తర్వాతే వాహనాలను ఆన్‌ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ కాసేపైనా వాహనాల ఇంజన్ ను ఆపడం ద్వారా కొంతసేపైనా వాటి నుంచి వచ్చే పొగను నియంత్రించవచ్చని, ఫలితంగా ఎంతోకొంత వాయుకాలుష్యాన్ని తగ్గించొచ్చని ఢిల్లీ ప్రభుత్వ భావన.

Updated On 25 Oct 2023 12:23 AM GMT
Ehatv

Ehatv

Next Story