దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) గత కొన్ని రోజులుగా పొగ మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు విషపూరితమైన గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) గత కొన్ని రోజులుగా పొగ మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు విషపూరితమైన గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దీపావళి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దీపావళి(Diwali) సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా(crackers) కాల్చడం తో నగరంలో ఎక్కడ చూసినా పొగలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారింది. బాణసంచా కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత చాలా దారుణమైన స్థితికి చేరుకుంది. ఉదయం 5:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 700 కంటే ఎక్కువ నమోదైంది. దీపావళి తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. అంతేకాకుండా రోడ్లపై పలు చోట్ల టపాసుల చెత్త కూడా దర్శనమిస్తున్నది.
ఎక్కడ ఏక్యూఐ ఎంత ఉంది?
ఆనంద్ విహార్ – 714
సిరిఫోర్ట్ – 480
గురుగ్రామ్ – 185
డిఫెన్స్ కాలనీ – 631
నోయిడా – 332
షహదర – 183
నజాఫ్‌ఘర్ – 282
పట్పర్గంజ్ – 513
ఆనంద్ విహార్‌తో సహా ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలలో ఏక్యూఐ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ప్రజలకు విషపూరితమైన గాలిని పీల్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. గతేడాది దీపావళి రోజున ఆకాశం నిర్మలంగా ఉంది. ఏక్యూఐ 218గా నమోదైంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది దీపావళి రోజున నగరంలో కాలుష్యం మళ్లీ తారస్థాయికి చేరుకుంది. దీపావళికి ముందు కూడా ఢిల్లీలో ఏక్యూఐ 400 కంటే ఎక్కువగా ఉంది, కానీ దీపావళి తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాజధానిలో మెట్టలు దగ్ధం కావడం, వాహనాల నుంచి పొగలు రావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఈ పరిస్థితులను నివారించడానికి, ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పటాకులను నిషేధించింది. దానిని అమలు చేయడానికి 377 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది. అవగాహన కల్పించే పని కూడా చేసింది. ఆ తర్వాత కూడా ఢిల్లీ గాలిలో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. తూర్పు, పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆంక్షలు ఉల్లంఘించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషపూరితమైన గాలిని పీల్చడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో దీపావళి సందర్భంగా 2022లో 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2018లో 281, 2017లో 319, 2016లో 431 ఏక్యూఐలు నమోదయ్యాయి.