Delhi's Air Quality Index : గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్ లాంటి విపత్తు మనకు సంభవిస్తే...?
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) వాయు నాణ్యత దారుణంగా(Oxygen quality) పడిపోయింది. శుక్రవారం ఉదయం తీవ్రమైన ప్లస్ కేటగిరికి చేరుకుంది. మితిమీరిన కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరాన్ని పొగ మంచు పూర్తిగా కమ్మేసింది. ఒక్క ఢిల్లీలోనే కాదు, రాజస్థాన్‌లోని(Rajasthan) హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హర్యానాలోని హిసార్, ఫతేబాబ్, జింద్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఘజియాబాద్,బాఘ్‌పట్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలలో కూడా వాయు నాణ్యత బాగా క్షీణించింది.
ఆ ఆలోచనే భయకంపితులను చేస్తోంది....
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) వాయు నాణ్యత దారుణంగా(Oxygen quality) పడిపోయింది. శుక్రవారం ఉదయం తీవ్రమైన ప్లస్ కేటగిరికి చేరుకుంది. మితిమీరిన కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరాన్ని పొగ మంచు పూర్తిగా కమ్మేసింది. ఒక్క ఢిల్లీలోనే కాదు, రాజస్థాన్‌లోని(Rajasthan) హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హర్యానాలోని హిసార్, ఫతేబాబ్, జింద్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఘజియాబాద్,బాఘ్‌పట్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలలో కూడా వాయు నాణ్యత బాగా క్షీణించింది. కాలుష్యం కోరల నుంచి నగరాలను రక్షించకపోతే ఏడు దశాబ్దాల కిందట లండన్‌లో ఏం జరిగిందో ఆ ఘోర విపత్తు మన దగ్గర కూడా జరిగే ప్రమాదం ఉంది. 70 ఏళ్ల కిందట లండన్ నగరంలో పట్టపగలే హఠాత్తుగా చీకటి కమ్ముకుంది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయకంపితులయ్యారు.
గాలి కలుషితమై నల్లగా మారిపోయింది. నగరాన్ని కమ్మేసింది. ఊపిరాడక ప్రజలు గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు. ఈ విపత్తును గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్‌గా పిలుచుకుంటారు. ఇప్పటికీ ఈ సంఘటనను తల్చుకుని ఇంగ్లాండ్ వణికిపోతుంటుంది. విపరీతమైన కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగమంచు నాలుగు రోజుల్లోనే 12 వేల మంది ప్రాణాలు తీసింది. భయంకరమైన శీతగాలులు వీస్తుండటంతో ఇళ్లను వెచ్చగా ఉంచడానికి, పారిశ్రామిక వినయోగానికి బొగ్గును విపరీతంగా ఉపయోగించడం వల్లే ఈ కాలుష్యం ఏర్పడింది. నల్లని పొగమంచు వ్యాపించింది. 1952 డిసెంబర్ 5వ తేదీన మొదలైన ఈ విలయం డిసెంబర్ 9వ తేదీ వరక కొనసాగింది. దశాబ్దాలుగా పొగమంచుతో ఇబ్బందులు పడుతున్న లండన్ ప్రజలకు ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. లక్షమందికిపైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రజల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. లండన్ నగరంలో వాయు కాలుష్యం 13వ శతాబ్దం నుంచే మొదలయ్యిందంటే ఆశ్చర్యం కలగకమానదు. అందుకే 1301లో ఎడ్వర్డ్-1 లండన్‌లో బొగ్గును నిషేధించారు. 16వ శతాబ్దం నాటికి అక్కడి గాలి అత్యంత విషపూరితంగా మారింది. గ్రేట్ స్మోగ్ అనేది బ్రిటీష్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుంది. ఇది జరిగిన తర్వాత 1956లో బ్రిటన్‌లో తొలిసారిగా క్లీన్ ఎయిర్ యాక్ట్ అమలులోకి తీసుకువచ్చారు. ఫలితంగా కొంత మేర కాలుష్యం తగ్గింది.